శంషాబాద్ సమీపంలో ముచ్చింతల్ (muchchintal)లోని శ్రీరామనగరం (sri ramanagar)లో ఉన్న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రానున్నారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి శుభదినాన శ్రీరామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ తెలిపారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విగ్రహంలోని అంతర్గత గదులను ప్రారంభించి, 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కే. చంద్రశేఖర్‌రావు, ఇతర రాష్ట్రాల సీఎంలు, మరికొందరు నేతలను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆశ్రమానికి చెందిన చినజీయర్‌స్వామి ఇప్పటికే ఆహ్వానించారు. చిన జీయర్ ఆశ్రమం వారు విరాళాలు సేకరించి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ నిర్మాణ ప్రాజెక్టు విలువ సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఉంటుంది. 1017లో జన్మించిన భగవత్ రామానుజ 120 ఏళ్లపాటు జీవించారని.. అందుకే 120 కేజీల పసిడితో శ్రీరామనుజుల విగ్రహాన్ని పాటు చేసినట్లు తెలుస్తోంది. ఏడు రోజుల పాటు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపనున్నారు. ఫిబ్రవరి 2న ప్రధాన పూజలు ప్రారంభమవుతాయని, 5న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని సమాచారం.
భగవత్ శ్రీరామానుజాచార్యులు 1000 ఏళ్లుగా సమానత్వ మంత్రానికి (equality mantra) ప్రసిద్ధి చెందారు. ఈ విగ్రహం, సంబంధిత కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో మరో 1000 ఏళ్లు అందరికీ గుర్తుండిపోతారు. ఫిబ్రవరి 13న రామానుజుల బంగారు విగ్రహం లోపలి గదిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరిస్తే.. కేసీఆర్, మోదీ కలిసి విగ్రహాన్ని జాతికి అంకితం చేయనున్నారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం పేరిట ఫిబ్రవరి 2న ప్రారంభ కార్యక్రమం మొదలవుతుంది. ఈ రోజు నుంచే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకానున్నారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా పేరు తెచ్చుకుంటోంది.
ఈ కార్యక్రమానికి కేసీఆర్ తో సహా ఇతర రాష్ట్రాల సీఎంలు, నేతలు, నటీనటులు, ఇతర ప్రముఖులతో పాటు మోదీ హాజరుకానున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల మధ్య అతిపెద్ద 216 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రపంచానికి అంకితం చేయనున్నారు. ఆచారాలలో భాగంగా 1035 హోమకుండలాలు (అగ్ని ఆచారాలు) వినియోగిస్తారు. వందలాది మంది ఋత్విక్కులు, సాధువులు ఈ గొప్ప కార్యక్రమానికి హాజరవుతారు.
https://youtu.be/-WMEUrX9tkY