వరదల్లో చిక్కుకున్న కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఇప్పటికే అనేక మంది ప్రముఖులు ముందుకొచ్చారు. తమ వంతు సహాయంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. కొందరు మలయాళీ నటులు తమ నివాసాల్లో ఇతరులకు ఆశ్రయం కల్పించారు. మరి కొందరు అత్యవసర సరకులు, ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు.
తాజాగా కథానాయిక కీర్తి సురేశ్ కేరళ వాసుల కోసం రూ.15 లక్షలు విరాళం అందించారు. రూ.10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి, రూ.5 లక్షలు రిలీఫ్ మెటీరియల్ కొనడానికి ఇచ్చారు.
అదేవిధంగా నటి పూనం పాండే కూడా మంచి మనసు చాటుకున్నారు. ఆమె ప్రస్తుతం తెలుగులో కె.వీరు దర్శకత్వంలో ‘లేడీ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గానూ తాను తీసుకున్న మొత్తం పారితోషికాన్ని ఆమె కేరళ ప్రజలకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. వరదల కారణంగా కేరళ రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. అక్కడ అవసరాలతో ఇబ్బందులు పడుతున్న వారి చుట్టూ తన ఆలోచనలు తిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కేరళ రిలీఫ్ ఫండ్‌కు తన సినిమా ‘లేడీ గబ్బర్ సింగ్’కు తీసుకునే మొత్తం పారితోషికాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చాలా మంది కేరళ ప్రజలకు అండగా నిలబడటం సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర పరిశ్రమలోని తన స్నేహితులు, అభిమానులు కూడా ముందుకు రావాలని కోరారు. పూనం తెలుగులో ‘మాలిని అండ్ కో’ అనే సినిమాలో నటించారు. తెలుగుతోపాటు హిందీలో 2015లో విడుదలైన ఈ చిత్రానికి కె. వీరు దర్శకత్వం వహించారు.

No comments:
Post a Comment